మనలో చాలా మందికి ఇవ్వవలసిన రుణానికి మొత్తం ఎలా నిర్ణయించబడుతుందో అర్ధంకాదు. కొన్నిసార్లు, అదే జీతంతో అదే సంస్థలో పనిచేస్తూన్న ఇద్దరు వ్యక్తులు రుణంగా పూర్తిగా భిన్నమైన మొత్తాలను పొందుతూ  ఉండడాన్ని మనం చూస్తాము. ఇది ఎలా సాధ్యం?

రుణ అర్హత రెండు వేర్వేరు లెక్కలపై ఆధారపడి ఉంటుంది

  • ప్రతి నెల చేసేందుకు మీరు భరించగలిగిన తిరిగి చెల్లించే రుణ మొత్తం.
  • ఆస్తి వెల యొక్క శాతం.

మొదటి లెక్కింపును చూద్దాం: తిరిగి చెల్లించే సామర్థ్యం

తిరిగి చెల్లింపు చేయగల సామర్థ్యం మీ మొత్తం ఆదాయ వ్యయాల పై ఆధారపడి ఉంటుంది. మీకు రూ.20, 000 నెలసరి ఆదాయం ఉందనుకుందాం, మరియు మీ నెలవారీ ఖర్చులు రూ.12, 000 అయితే, అప్పుడు మీరు తీసుకునే  ఏ రుణానికైనా రూ. 8000. మీరు చెల్లించగలరు. అర్హత గల మొత్తాన్ని నిర్ణయించేందుకురుణ కాలపరిమితికి ఈ సంఖ్యను రివర్స్ లెక్కించడం జరుగుతుంది. సహజంగానే, మీ తిరిగి చెల్లించే సామర్థ్యం ఎంత పెద్దదైతే, మీ రుణ అర్హత అంత అధికంగా ఉంటుంది.

ఇది అంత సులభమా?

కాదు. కానీ అది ఆధారం. ఇతర అంశాలు కూడా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఉదా, మీరు ఇప్పుడు మీ ఇంటిని స్వంతం చేసుకోబోతున్నారు కాబట్టి మీరు చెల్లించవలసిన అద్దెలో రూ.2000 పొదుపు చేయగలిగితే అప్పుడు మీరు రుణంగా పొందగల మొత్తాన్ని సమర్ధవంతంగా పెంచుతూ, మీ తిరిగి చెల్లించే సామర్థ్యం (రూ. 8000 ప్లస్ రూ 2000) అవుతుంది. ఇంకా, అదే  ఆదాయానికి, ఎక్కువ కాలపరిమితి రుణాలకు రుణం కోసం అర్హతఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అదే మొత్తానికి తిరిగి చెల్లింపు మరింత ఎక్కువ సమయానికి వ్యాపింపజేయబడి  ఉంటుంది కనుక.

ఆదాయంగా దేనిని భావిస్తారు?

రుణగ్రహీతల ఆదాయం తెలుసుకోవడం కోసం కొన్ని ప్రాథమిక నియమాలు, క్రింద ఇవ్వబడ్డాయి. సాధారణంగా ఈ క్రింది వాటిని ఒక ఆదాయ వర్గంగా పరిగణించడం జరగదు

  • మెడికల్ తిరిగిచెల్లింపు, పనితీరు బోనస్, లేదా ఎల్ టిఎ, ఎందుకంటే అవి ఎప్పుడూ ఒకేరీతిగా లేదా ఒకే మొత్తంలో అందుబాటులో ఉండవు కనుక.
  • వడ్డీ ఆదాయం, మూలం అనేది నికర ఆదాయ వనరుగా నిరూపించగలిగితే తప్ప
  • అధికసమయం, ఇటువంటి కారణాలతోనే.
  • వ్యయం వౌచర్లు, అద్దె ఆదాయాలు మొ., వంటి తనిఖీ చేయబడలేని  మూలాల నుండి ఏదైనా సంపాదన, మూలం ఏకరీతిగా ఉన్నదని మరియు స్థిరమైనదని చెప్పే డాక్యుమెంటరీ రుజువు అందించబడితే తప్ప.

స్వయం ఉపాధి వృత్తిపరులకి,  పత్రాలలో కొన్ని మారుతాయి మరియు కొలతలు ఒక విధంగా భిన్నమైనవి.

ఆస్తి ఉమ్మడి యాజమాన్యం విషయంలో, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు దరఖాస్తుదారునిది మరియు సహ-దరఖాస్తుదారునిది ఇద్దరి యొక్క ఆదాయాలను ఒకటిగా కలపబడవచ్చు.

ఇప్పటికే ఉన్న రుణాలు

మీకు ఇప్పటికే ఉన్న రుణాలు ఏవైనా ఉంటే, అవి మీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే  ఇప్పటికే ఉన్న రుణం పై ఇఎమ్ఐ ద్వారా మీ ఖర్చుపెట్టగల ఆదాయం (పై ఉదాహరణలో రూ.8000) తగ్గించబడుతుంది కనక. ఎక్కువగా, అయితే, 6 నెలల లేదా ఆ విధంగా స్వల్పకాలానికి తీసుకునే రుణాలను పరిగణించడం జరగదు

కాల పరిమితి

దీర్ఘ కాల పరిమితిని తీసుకోవడం ద్వారా రుణ అర్హత మొత్తాన్ని ఎక్కువ చేసుకోవచ్చని మీరు అర్ధం చేసుకోగా, ఈ మార్గం యొక్క పరిమితులను అర్థం చేసుకోవడం ముఖ్యం.

అందుబాటులో ఉన్న రుణం యొక్క గరిష్ట కాలపరిమితి దరఖాస్తు సమయంలో మీ వయస్సు ఆధారంగా ఉంటుంది. జీతంగల ఉద్యోగులకు వయసు 58 సంవత్సరాల/60 సంవత్సరాల (మీ సంస్థ వద్ద విరమణ నిర్వచించబడిన విధంగా) కు మించకూడదు మరియు స్వయం ఉపాధి వృత్తిపరులకు 65 సంవత్సరాలకు మించకూడదు..

దీనిని దృష్టిలో పెట్టుకుని, సాధ్యమైనంత గరిష్ఠ కాలపరిమితికి తీసుకోవడం గరిష్ఠ మొత్తానికి అర్హతను ఖాయం చేస్తుంది.


మీ నెలవారీ తిరిగి చెల్లించే ఎంపికల కోసం ఒక సుమారు సంఖ్య పొందేందుకు మీకు సహాయపడే ఒక ఇఎమ్ఐ క్యాలిక్యులేటర్ సాధనం మా వద్ద ఉంది.

ఒక ఖచ్చితమైన మొత్తం కోసం, దయచేసి మాకు కాల్ చెయ్యండి, లేదా మమ్మల్ని కలిసేందుకు రండి, మరి మీ కోసం వివరాలను లెక్క వేయడం మాకు ఆనందంగా ఉంటుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website