ఒకసారి మీ దరఖాస్తు ప్రాసెస్ చేయబడి మరియు అభ్యర్థించిన రుణం మొత్తం మరియు మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి, మీరు అర్హులైన తుది రుణ మొత్తాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఏ నిబంధనలు మరియు షరతులు కింద మీకు మంజూరు చేయబడిందో తెలియజేస్తూ ఒక మంజూరు లేఖ జారీ చేయబడుతుంది. రుణ మొత్తం పంపిణీ జరిగే పూర్వం ఈ నిబంధనలుమరియు షరతులను నెరవేర్చవలసి ఉంటుంది..

ఆఫర్ లేఖ

ఆఫర్ లేఖ రుణ మొత్తాన్ని, వడ్డీ రేటు, కాలపరిమితి, తిరిగి చెల్లింపు విధానం మరియు ఇతర వివరాలు మరియు ప్రత్యేక పరిస్థితులను పేర్కొంటుంది..

తదుపరి, మంజూరు లేఖ యొక్క నిబంధనలు మరియు షరతులులో ఇచ్చిన ఏవైనా దస్తావేజులతో పాటుగా మాద్వారా  అందజేయబడిన ప్రామాణిక ఫార్మాట్ లో మీరుఒక అంగీకారం లేఖ ఇవ్వవలసి ఉంటుంది. ఈ స్థాయివరకూ ఇది మీ ఋణం ప్రతిపాదనకు  ఒక ఆర్థిక ఆమోదం మాత్రమే. మీరు ఆఫర్ అంగీకరించిన తరువాత మరియు తాకట్టు చట్టపరంగా అమలపరచదగినదై మరియు సాంకేతికంగా స్పష్టంగా ఉంటే రుణం చెల్లించుట జరుగుతుంది.

చట్టపరమైన దస్తావేజుల సమర్పణ

ఒకసారి మీరు ఆఫర్ అంగీకరించినప్పుడు రుణం పూర్తిగా తిరిగి చెల్లించబడేంతవరకు అనుషంగిక భద్రతా గా మా వద్ద ఉంచుకునేందుకు వీలుగా ఆస్తి యొక్క అసలు దస్తావేజులను అప్పగించవలసి ఉంటుంది.

ఒప్పందం సంతకం 

ఒప్పందాన్ని తగిన విధానంగా సంతకం చేయడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website