మీరు నా రుణ అర్హత మరియు రుణ మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారు?

ఒక రుణానికి అర్హత కలిగి ఉండేందుకు, ప్రాధమిక ప్రమాణం ఏమిటంటే మీరు ఒక ఆదాయం సంపాదిస్తున్న వయోజన భారతీయ పౌరుడై ఉండాలి. రుణ మొత్తం అనేది వయస్సు, అర్హతలు, స్థిరత్వం మరియు ఆదాయం కొనసాగింపు, పొదుపు అలవాటు, తిరిగిచెల్లింపు బాధ్యతలు, తిరిగిచెల్లింపు చరిత్ర,, కంపెనీ యొక్క ఆమోదించబడిన పాలసీ ప్రకారం రుణ పరిమితి మరియు మార్జిన్ అవసరాలకు లోబడి ఆస్తులు మరియు బాధ్యతలు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇప్పటికే ఉన్న ఒక రుణం నా రుణ అర్హతను ప్రభావితం చేస్తుందా?

అవును. సంతృప్తికరమైన ఆదాయ స్థాయి రుజువులను మీరు అందజేస్తే తప్ప అది ప్రభావితం చేయవచ్చు. రుణ అర్హత నిర్ణయించేందుకు ఇప్పటికే ఉన్న రుణం యొక్క అవధిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఇప్పటికే ఉన్న ఋణాన్ని నేను తిరిగి చెల్లించితే, రుణ అర్హత మరియు పరిమాణం పెరుగుతుందా?

ఇప్పటికే ఉన్న దాన్ని మీరు తిరిగి చెల్లిస్తే, మీ చేతిలో నికర ఖర్చుపెట్టగల ఆదాయం పెరుగుతుంది, అది అధిక రుణం కోసం మిమ్మల్ని అర్హులుగా చేస్తుంది

నా భార్య/భర్త/ ఏ ఇతర సహ దరఖాస్తుదారు యొక్క ఆదాయం రుణ అర్హత నిర్ణయించడం కోసం పరిగణించబడుతుందా?

అవును. పైన వివరించిన విధంగా భార్య/భర్త /ఏ ఇతర సహ దరఖాస్తుదారు అయినా రుణ అర్హత ప్రమాణానికి సరిపోతారో లేదో అనేదానిపై ఆధారపడి ఆదాయం పరిగణలోకి తీసుకోబడవచ్చు

నా యజమాని వద్ద స్టాఫ్ హౌసింగ్ రుణం పథకానికి బదులుగా వడ్డీ రాయితీ పథకం ఉంది. రుణ అర్హత నిర్ణయించడంలో మీరు దీనిని పరిగణిస్తారా?

అవును. ఇది రుణ పరిమితి మరియు మార్జిన్ అవసరాలకు లోబడి మీ రుణ అర్హతను పెంచుతుంది.

నేను నా యజమానుల నుండి రుణం వాడుకుని ఉంటే ఒక హౌసింగ్ రుణానికి నాకు అర్హత ఉంటుందా?

అవును. మీరు కేంద్ర /రాష్ట్ర /పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉద్యోగి అయి ఉండి మరియు మీ యజమానులు పరిపస్సు 2 వ అభియోగంపై అనుకూలంగా ఉన్నట్లయితే మీరు రుణానికి అర్హులు. దయచేసి ఫైనాన్స్ చేయబడవలసిన ఆస్తి మరియు రెండు చోట్ల నుండి రుణ పరిమాణం మొత్తం రుణ అర్హతకు లోబడి ఆస్తి సీలింగ్, మార్జిన్ అవసరాలు మించలేదు అని వ్యాపార ప్రాంతంతో చెక్ చేసుకోండి.

నేను ఒక కొత్త కంపెనీ చేరబోతూ ఉన్నాను. మీరు ఏ ఆదాయాన్ని పరిగణిస్తారు – నాకు ప్రస్తుతం ఉన్నదానినా లేదా కొత్త ఆదాయాన్నా

సహజంగానే, కొత్త యజమాని నుండి ఆదాయం.

నేను రిటైర్ అవడానికి కొద్ది సంవత్సరాల సమయం ఉంది. నాకు రుణానికి అర్హత ఉన్నదా?

అవును. మీ కేసును మేము కనీసం 5 సంవత్సరాల కాలం కోసం పరిగణించవచ్చు మరియు పదవీ విరమణ అయిన మీదట రుణం తిరిగిచెల్లింపును మీరు చేపట్టవలసి ఉంటుంది.

మీర ఎన్ఆర్ఐలకు రుణాలను ఇస్తారా? విదేశీ పాస్పోర్ట్ గల భారతీయ మూలం గల వ్యక్తులు హౌసింగ్ రుణాలను పొందుతారా?

అవును. భారతదేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ యొక్క వర్తించే మార్గదర్శకాల ప్రకారం, విదేశీ పాస్పోర్ట్ గల భారతీయ మూలం గల వ్యక్తులు రుణాలకు అర్హులు.

రుణానికి సెక్యూరిటిగా మీరు ఏమి తీసుకుంటారు?

మా ద్వారా ఫైనాన్స్ చేసేందుకు ప్రతిపాదించబడిన ఆస్తి యొక్క తాకట్టు ప్రాథమిక సెక్యూరిటి అయి ఉంటుంది. ప్రమాద అంచనా పై ఆధారపడి, ఎల్.ఐ.సి. పాలసీలు,ఎన్ఎస్ సిలు,ఎఫ్ డిలు, ఇతర స్థిరాస్తులు, వ్యక్తిగత హామీ రూపంలో కొల్లేటరల్ సెక్యూరిటి అవసరం కావచ్చు.

ఒప్పందం రిజిస్టర్ చేయబడవలసి ఉంటుందా?

అవును. ఇది మీ సొంత శ్రేయస్సు కోసం మరియు చట్టానికి అవసరమైన విధంగా మీరు తప్పకుండా ఒప్పందం/దస్తావేజును స్టాంప్ చేసి రిజిస్టర్ చెయ్యాలి.

ఆస్తి తాకట్టు పెట్టబడినప్పుడు, నా తిరిగి చెల్లించే సామర్థ్యం ఎందుకు పరీక్షించబడుతుంది?

డిఫాల్ట్ జరిగిన పక్షంలో ఆస్తిని అమ్మివేయవచ్చు! రుణ ఒప్పందం అనేది ఒక చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే కట్టుబడి ఉండవలసిన దస్తావేజు. తాకట్టుతో సంబంధం లేకుండా, ఒక రుణగ్రహీత నుండి బాకీలు వసూలు చేసుకునేందుకు ఒక రుణదాత అమలు చేయవచ్చు. తాకట్టు రికవరీని వేగవంతం చేసేందుకు సహాయపడుతుంది. మీ హౌసింగ్ కలలు పండించుకోవడం కోసం మీకు రుణం అందించబడింది.

ఆస్తి తాకట్టులో ఉన్నప్పుడు మీరు గ్యారెంటార్లను ఎందుకు తీసుకుంటారు?

తాకట్టును అమలు చేయడం మీ ఆస్తి శాశ్వత నష్టానికి దారితీస్తుంది, అది మా లక్ష్యం కాదు. అలాంటి సందర్భాలలో గ్యారంటార్లు మిమ్మల్ని రక్షించటానికి వస్తారు.

ఋణం కోసం మీకు ఏ పత్రాలు కావాలి?

పత్రం జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాకు నచ్చిన నివాసాన్ని ఎంచుకోవడంలో మీరు నాకు సహాయం చేయగలరా?

దయచేసి దగ్గరలోని ప్రాంతాన్ని లేదా సహాయాన్ని సంప్రదించండి.

ప్రీ ఇఎమ్ఐ మరియు ఇఎమ్ఐ అనేవి ఏమిటి?

ప్రీ ఇఎమ్ఐ అనేది తుది వితరణ తేది వరకు ప్రతి నెల మీరు చెల్లించదగిన వితరణ చేయబడిన రుణం పై సరళ వడ్డీ. ఇఎమ్ఐ అనేది అసలు మరియు వడ్డీ కలిగిన సరిసమానమైన నెలసరి వాయిదా.

నేను నా రుణాన్ని ఫిక్సెడ్ రేట్ రుణం నుంచి వేరియబుల్ రేట్ రుణానికి మరియు అటు నుండి ఇటు మార్చుకోవచ్చా?

కంపెనీ పాలసీకి లోబడి మీరు నామమాత్రపు ఫీజుకు ప్రతిగా పథకాల మధ్య మీ రుణాన్ని మార్చుకోవచ్చు.

నా షెడ్యూల్ కాలపరిమితికి ముందే నేను రుణాన్ని తిరిగి చెల్లించవచ్చా?

షెడ్యూల్ చేయబడిన కాలపరిమితికి ముందుగానే మీరు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. పాక్షిక తిరిగి చెల్లింపుకు ఛార్జీలు ఏమీ ఉండవు. అయితే, షెడ్యూల్ కు ముందే రుణం మూసివేత కోసం ఛార్జీలు పడతాయి.

రుణం పై నాకు పన్ను ప్రయోజనం లభిస్తుందా?

పన్ను ప్రయోజనాల కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ విధానాలు మార్పుకు లోబడతాయా?

ఈ విధానాలు క్రమానుగతంగా సమీక్షించబడవచ్చు.

చెల్లించవలసిన ఫీజు ఏమిటి?

ప్రతి వినియోగదారుడు చాలా నామమాత్రపు ప్రోసెసింగ్ ఫీజు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఖచ్చితమైన మొత్తాల కోసం దయచేసి మీకు అత్యంత సమీపంలో గల శాఖను సంప్రదించండి.

జిఐసిహెచ్ఎఫ్ లిమిటెడ్ నుండి పొందిన రుణాలకు ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటి?

జిఐసిహెచ్ఎఫ్ నుండి పొందిన రుణం కోసం వేల్యూ ఎడిషన్స్ ఈ క్రింద ఇవ్వబడ్డాయి ప్రమాదవశాత్తు మృతిపై రుణగ్రహీతకు ఉచిత భీమా. అగ్ని మరియు సంబంధిత అపాయానికి ప్రతిగా సంపత్తి యొక్క ఉచిత భీమా. కాలపరిమితి ముగింపుకు ముందు రుణం యొక్క పాక్షిక తిరిగి చెల్లింపుపై ఎటువంటి ఛార్జీలు లేవు. కాలపరిమితిలో చేయదగిన పాక్షిక తిరిగి చెల్లింపుల కోసం ఏమీ స్థిరమైన సంఖ్య లేకపోవడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website