జిఐసిహౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, (జిఐసిహెచ్ఎఫ్ఎల్) తన వినియోగదారులతో వ్యాపార వ్యవహారాల్లో పారదర్శకతను అందించడం కోసం కోడ్ ను స్వీకరించింది.

 • లక్ష్యాలు:
  1. వినియోగదారులతో వ్యవహరించడంలో కనీస ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా మంచి మరియు న్యాయమైన ఆచరణలను ప్రోత్సహించడం;
  2. సేవల నుంచి సహేతుకంగా వారు ఏమి  ఆశించవచ్చు అనే దాని గురించి వినియోగదారునికి మెరుగైన  అవగాహన కల్పించేందుకు వీలుగా పాదర్శకతను పెంచడం;
  3. మార్కెట్ శక్తులను, పోటీ ద్వారా, అధిక ఆపరేటింగ్ ప్రమాణాలను సాధించడానికి ప్రోత్సహించడం;
  4. వినియోగదారునికి మరియు జిఐసిహెచ్ఎఫ్ఎల్మధ్య న్యాయమైన మరియు సుహృద్భావగల సంబంధాన్ని ప్రోత్సహించడం;; మరియు హౌసింగ్ ఫైనాన్స్ వ్యవస్థలో విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి.
  • కోడ్ యొక్క అప్లికేషన్ :  ఈ కోడ్ జిఐసిహెచ్ఎఫ్ఎల్ యొక్క ఉద్యోగులు అందరికీ మరియు దాని వ్యాపార సరళిలో దానికి ప్రాతినిధ్యం వహించేందుకు అధికారం గల ఇతర వ్యక్తులకు వర్తిస్తాయి
  • కమిట్మెంట్స్:  హౌసింగ్ ఫైనాన్స్ పరిశ్రమలో ప్రబలంగా ఉన్న ప్రామాణిక పద్ధతులకు సాటిగా నిలిచేందుకు, అన్ని వ్యవహారాల్లోనూ నిజాయితీగా మరియు  సహేతుకంగా వ్యవహరించేందుకు, సమగ్రత మరియు పారదర్శకత అనే నైతిక సూత్రంపై, జిఐసిహెచ్ఎఫ్ఎల్ ఈ కోడ్ కు కట్టుబడి ఉంటుంది అవగాహన చేసుకోవడంలో వినియోగదారునికి, ఏ విధమైన సందిగ్ధతా లేకుండా,  జిఐసిహెచ్ఎఫ్ఎల్ స్పష్టమైన సమాచారం అందిస్తుంది:
   1. నిబంధనలు మరియు షరతులతో కూడిన ఉత్పత్తులు మరియు సేవలు, వడ్డీ మరియు సర్వీస్ ఛార్జీలతో సహా.
   2. వినియోగదారునికి అందుబాటులో ఉన్న ప్రయోజనాలు.

   తప్పులు, ఏవైనా  ఉన్నట్లయితే, సరిదిద్దుకోవడంలో జిఐసిహెచ్ఎఫ్ఎల్ త్వరగా మరియు సానుభూతిపూర్వకంగా వ్యవహరిస్తుంది, మరియు వినియోగదారుని ఫిర్యాదులను ఈ కోడ్ లక్ష్యాల మార్గదర్శకంలోపరిష్కరించేందుకు, హాజరు అవుతుంది. వినియోగదారుల యొక్క వ్యక్తిగత సమాచారమంతటినీ  ఏకాంతమైనదిగానూ మరియు గోప్యమైనదిగానూ జిఐసిహెచ్ఎఫ్ఎల్ భావిస్తుంది మరియు క్రమబధ్ధీకరణ అధికారులు లేదా క్రెడిట్ ఏజెన్సీ లేదా వినియోగదారుని ద్వారా సమాచారాన్ని పంచుకోవడం అనుమతించబడిన ప్రదేశంతో సహా ఏ చట్టం లేదా ప్రభుత్వం అధికారులకు అవసరమైతే తప్ప మూడో వ్యక్తికి ఏ సమాచారాన్ని వెల్లడి చేయదు. అభ్యర్థించిన మీదట జిఐసిహెచ్ఎఫ్ఎల్, ప్రస్తుతం ఉన్న రుణగ్రహీతలకు మరియు కొత్త వినియోగదారునికి వ్యాపార లావాదేవీ ఆరంభానికి పూర్వం కోడ్ యొక్క ప్రతిని అందజేస్తుంది. వయసు, జాతి, కుల, లింగభేదం, వివాహ స్థితి, మతం లేదా వైకల్యం ఆధారంగా దాని వినియోగదారుల పట్ల జిఐసిహెచ్ఎఫ్ఎల్ వివక్షత చూపదు. అయితే, రుణ ఉత్పత్తుల్లో పేర్కొన్న విధంగా, ఆంక్షలు ఏవైనా ఉంటే,  అవి వర్తించడం కొనసాగుతుంది.

  • వెల్లడింపు మరియు పారదర్శకత : వీటి ద్వారా జిఐసిహెచ్ఎఫ్ఎల్ వడ్డీ రేట్లు, సాధారణ రుసుములు మరియు ఛార్జీల పై సమాచారాన్ని అందిస్తుంది:ఎ. శాఖల్లో నోటీసులు పెట్టటం;బి. టరీఫ్ షెడ్యూల్ అందించడం..
  • ప్రకటనలు, మార్కెటింగ్ మరియు సేల్స్అన్ని ప్రకటనల మరియు ప్రచార సామగ్రి స్పష్టంగా ఉన్నాయని, మరియు తప్పుదారి పట్టించే విధంగా లేవని జిఐసిహెచ్ఎఫ్ఎల్ నిర్ధారించుకుంటుంది. వారు వ్యక్తిగతంగా ఉత్పత్తులను అమ్మడం కోసం వినియోగదారుని సమీపించినప్పుడు వారి గుర్తింపు మేరకు సేల్స్ అసోసియేట్స్/కంపెనీ ప్రతినిధులకు కూడా ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ వర్తిస్తుంది.
  • క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలు :  జిఐసిహెచ్ఎఫ్ఎల్, క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలకు వినియోగదారుని గురించి సమాచారాన్ని, వీటిపై ఇస్తుంది: -
   ఎ. ఒక ఖాతా తెరవడం బి. అతని/ఆమె చెల్లింపుల్లో వినియోగదారుడు వెనుకబడిపోవడం. c. సి. బకాయిలు తిరిగి రాబట్టుకునేందుకు వినియోగదారునికి ప్రతిగా న్యాయ విచారణలు ప్రారంభించబడటం.. డి. వినియోగదారునికి ప్రతిగా చట్టపరమైన మార్గాలు చేపట్టడంద్వారా అప్పులు సర్దుబాటు చేయబడటం
   చట్టానికి అవసరమైతే లేదా అలా చేయడానికి వినియోగదారుడు అతని/ఆమె అనుమతిని వారికి ఇచ్చినట్లయితే వినియోగదారుని ఖాతా గురించి ఇతర సమాచారాన్ని క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలకు జిఐసిహెచ్ఎఫ్ఎల్ అందజేయవచ్చు.
  • బాకీల సేకరణ : రుణాలు   ఎప్పుడెప్పుడు ఇవ్వబడతాయో, అప్పుడు, మొత్తం, కాలపరిమితి మరియు పిరియాడిసిటి ద్వారా వినియోగదారునికి తిరిగి చెల్లింపు ప్రక్రియను జిఐసిహెచ్ఎఫ్ఎల్ వివరిస్తుంది. అయితే, వినియోగదారుడు తిరిగి చెల్లించే షెడ్యూల్ కు కట్టుబడి ఉండకపోతే, బకాయిలు రాబట్టేందుకు స్థానీయ చట్టాలకు అనుగుణంగా ఒక నిర్వచిత ప్రక్రియను అనుసరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో వినియోగదారునికి అతనికి/ ఆమెకు నోటీసు పంపడం ద్వారా లేదా వ్యక్తిగతంగా సందర్శనల ద్వారా గుర్తుచేయడం మరియు/లేదా సెక్యూరిటీ, ఏదైనా ఉంటే , దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఉంటాయి.  జిఐసిహెచ్ఎఫ్ఎల్ సిబ్బంది లేదా అప్పులు సేకరణలో లేదా/మరియు సెక్యూరిటీ తిరిగి స్వాధీనం చేసుకోవడంలో కంపెనీకి ప్రాతినిధ్యం వహించేందుకు అధీకృతం ఇవ్వబడిన ఏ వ్యక్తి  అయినా తనను తాను స్వయంగా గుర్తింపు పరిచయం చేసుకుంటారు మరియు జిఐసిహెచ్ఎఫ్ఎల్ జారీ చేసిన అధీకృతం లేఖను ప్రదర్శిస్తారు మరియు అభ్యర్థించిన మీదట , జిఐసిహెచ్ఎఫ్ఎల్  ద్వారా లేదా జిఐసిహెచ్ఎఫ్ఎల్  అధికారం క్రింద జారీ చేయబడిన అతని/ఆమె గుర్తింపు కార్డును ప్రదర్శిస్తారు. గడువుదాటి పోయిన బాకీలకు సంబంధించిన సమాచారం అంతా కంపెనీ వినియోగదారులకు అందిస్తుంది.  పరస్పరం  ఆమోదయోగ్యమైన మరియు సక్రమమైన విధంగా బాకీలకు సంబంధించిన వివాదాలు లేదా తేడాలను పరిష్కరించేందుకు అన్ని విధాలా సహాయం అందజేయబడుతుంది.  బకాయిల సేకరణ కోసం వినియోగదారుల స్థానాలకు సందర్శనల సమయంలో, సభ్యత మరియు మర్యాదతో వ్యవహరించడం జరుగుతుంది.
  • మీ వినియోగదారుని తెలుసుకోండి(కెవైసి) మార్గదర్శకాలు : జిఐసిహెచ్ఎఫ్ఎల్, తన వినియోగదారులకు కెవైసి మార్గదర్శకాల అవసరాలను వివరిస్తుంది మరియు రుణం మంజూరు, ఖాతా తెరవడం మరియు ఆపరేషన్ కు పూర్వం వినియోగదారుని గుర్తింపును స్థాపించేందుకు అవసరమైన దస్తావేజుల గురించి వారికి తెలియజేస్తుంది. జిఐసిహెచ్ఎఫ్ఎల్,  కంపెనీ యొక్క కెవైసి కి, ఏంటి-మనీ లాండరింగ్ లేదా ఏవైనా ఇతర చట్టబధ్ధమైన అవసరాలకు అవసరమైన, కేవలం అటువంటి సమాచారాన్నే గ్రహిస్తుంది. ఏదైనా అదనపు సమాచారం అడగబడినట్లయితే,  అది విడిగా అడగబడుతుంది మరియు అటువంటి అదనపు సమాచారాన్ని పొందే  ఉద్దేశ్యాన్ని పేర్కొంటుంది.
  • డిపాజిట్ ఖాతాలు : జిఐసిహెచ్ఎఫ్ఎల్ వడ్డీ రేటు, వడ్డీ వర్తింపజేసే పద్ధతి,  డిపాజిట్ల కాలపరిమితి, సమయానికి పూర్వమే ఉపసంహరణ, పునరుద్ధరణ (రెన్యూవల్), డపాజిట్లకు ప్రతిగా రుణం, నామినేషన్ వసతులు మొదలైనవాటితో సహా తమ  వివిధ డిపాజిట్ పథకాలకు సంబంధించిన సమాచారం అంతా అందజేస్తుంది.
  • రుణాలు: జిఐసిహెచ్ఎఫ్ఎల్ద్వారా లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం అంచనా : జిఐసిహెచ్ఎఫ్ఎల్ వినియోగదారునికి రుణాన్ని ఇవ్వలేకపోతే, తిరస్కరణకు గల కారణా(లు)న్ని అది లిఖితపూర్వకంగా తెలియపరుస్తుంది. వినియోగదారుడు అతని/ఆమె బాధ్యతల కోసం ఎవరినుండి అయినా ఒక హామీ లేదా ఇతర సెక్యూరిటీను జిఐసిహెచ్ఎఫ్ఎల్ అంగీకరించాలి అని కోరితే, అతని ఆర్ధిక స్థితుల గురించిన గోప్యమైన సమాచారాన్ని ఆ హామీ లేదా  ఇతర సెక్యూరిటీని ఇచ్చే వ్యక్తికి,  లేదా వారి న్యాయసలహాదారుకి కంపెనీ ఇవ్వవచ్చు.
  • రుణాలు మరియు దాని ప్రోసెసింగ్ కోసం అనువర్తనాలు : ఒక రుణం ఉత్పత్తి సోర్సింగ్ సమయంలో, జిఐసిహెచ్ఎఫ్ఎల్, వర్తించేవడ్డీరేట్లు అలాగే ప్రాసెసింగ్ కోసం చెల్లించవలసిన ఫీజు/ ఛార్జీలు వంటివి, ఏవైనా ఉంటే, ముందు చెల్లింపు వికల్పాలు మరియు ఛార్జీలు ఏవైనా ఉంటే మరియు రుణగ్రహీతల శ్రేయస్సును ప్రభావితం చేయగల ఏదైనా ఇతర విషయాల గురించిన సమాచారాన్ని అందజేస్తుంది.రుణ దరఖాస్తు ప్రాసెస్ చేసేందుకు అవసరమైన అన్ని వివరాలు  దరఖాస్తు సమయంలో జిఐసిహెచ్ఎఫ్ఎల్ కు సమర్పించబడతాయి. ఏదైనా అదనపు సమాచారం అవసరమైన సందర్భంలో, జిఐసిహెచ్ఎఫ్ఎల్  వినియోగదారుని సంప్రదిస్తుంది.ఉన్న నిబంధనలు మరియు షరతులతో పాటు జిఐసిహెచ్ఎఫ్ఎల్ వినియోగదారునకి రుణ మంజూరును తెలియజేస్తుంది.వినియోగదారుడు ప్రమాణీకరించబడిన రుణం దస్తావేజులను అమలుపరిచిన మీదట వాటి యొక్క ఒక సెట్ ను ఉచితంగా పొందేందుకు అర్హత కలిగి ఉంటారు. రుణ విషయంలో జిఐసిహెచ్ఎఫ్ఎల్ లింగభేదం , కులం మరియుమత కోణాలలో వివక్షత చూపదు. అయితే , సమాజంలో వివిధ విభాగాల కోసం పథకాలు నెలకొల్పడం లేదా పాల్గొనడం నుంచి ఇది జిఐసిహెచ్ఎఫ్ఎల్ ను దూరం చేయదుజిఐసిహెచ్ఎఫ్ఎల్ సాధారణ కోర్సులో తమ విచక్షణతో, రుణగ్రహీత నుండి గాని లేదా ఒక బ్యాంకు/ఆర్థిక సంస్థ నుండి గాని రుణ ఖాతా బదిలీ కోసం అభ్యర్ధనను ప్రాసెస్ చేస్తుంది.ఒప్పందం కింద చెల్లింపును లేదా పనితీరును రీకాల్/ వేగవంతం చేసేందుకు లేదా అదనపు సెక్యూరిటీలను కోరుతూ రుణ విషయంలో జిఐసిహెచ్ఎఫ్ఎల్ లింగభేదం , కులం మరియు మత కోణాలలో వివక్షత చూపదు. అయితే , సమాజంలో వివిధ విభాగాల కోసం పథకాలు నెలకొల్పడం లేదా పాల్గొనడం నుంచి ఇది జిఐసిహెచ్ఎఫ్ఎల్ ను దూరం చేయదు .
   జిఐసిహెచ్ఎఫ్ఎల్ సాధారణ కోర్సులో తమ విచక్షణతో, రుణగ్రహీత నుండి గాని లేదా ఒక బ్యాంకు/ఆర్థిక సంస్థ నుండి గాని రుణ ఖాతా బదిలీ కోసం అభ్యర్ధనను ప్రాసెస్ చేస్తుంది..ఒప్పందం కింద చెల్లింపును లేదా పనితీరును రీకాల్/ వేగవంతం చేసేందుకు లేదా అదనపు సెక్యూరిటీలను కోరుతూ నిర్ణయం తీసుకునే పూర్వం రుణం ఒప్పందానికి అనుగుణంగా రుణగ్రహీతలకు జిఐసిహెచ్ఎఫ్ఎల్ నోటీసు ఇస్తుంది.
   అన్ని బకాయిల చెల్లించిన మీదట లేదా బాకీ ఉన్న రుణం మొత్తాన్ని తిరిగి పొందిన మీదట, రుణగ్రహీతకు ప్రతిగా జిఐసిహెచ్ఎఫ్ఎల్ కు చట్టపరంగా కల వేరే ఏ ఇతర క్లెయిమ్ లేదా వాదం ఉండకుండా ఉన్నట్లయితే జిఐసిహెచ్ఎఫ్ఎల్ అన్ని సెక్యూరిటీలను విడిచిపెడుతుంది. అటువంటి హక్కు లేదా సెట్ ఆఫ్ అమలు చేయాలనుకుంటే, మిగిలిన క్లెయిముల గురించిన మరియు సంబంధిత క్లెయిమ్ సర్దుబాటు/చెల్లింపు అయ్యేంతవరకు ఆ సెక్యూరిటీలను తమతో ఉంచుకునేందుకు కంపెనీ ఏ పరిస్థితుల క్రింద అర్హత కలిగి ఉన్నదో పూర్తి వివరాలతో రుణగ్రహీతకు నోటీసు ఇవ్వడం జరుగుతుంది.
 • గ్యారంటార్లు(హామీ ఇచ్చేవారు): ఒక రుణానికి ఒక వ్యక్తి ఒక హామీ ఇచ్చే వానిగా పరిగణించబడినప్పుడు, రసీదు అందుకోవడం కింద జిఐసిహెచ్ఎఫ్ఎల్అతనికి/ఆమె ఈ క్రిందివి తెలియజేస్తుంది-హామీ ఇచ్చే వ్యక్తిగా బాధ్యత షరతులను పేర్కొంటూ హామీ లేఖ/డీడ్.అతను/ఆమె హామీగా నిలిచే రుణగ్రహీత రుణం సర్వీసింగ్ విషంలో ఏదైనా డిఫాల్ట్ గురించి ఆమెకు/అతనికి జిఐసిహెచ్ఎఫ్ఎల్ తెలియజేసి ఉంచుతుంది
 • బ్రాంచ్ మూసివేత/బదిలీ :తమ శాఖ కార్యాలయం మూసివేత/బదిలీ సందర్భంలో జిఐసిహెచ్ఎఫ్ఎల్వినియోగదారునికి నోటీసు ఇస్తుంది.
 • ఫిర్యాదులు:  జిఐసిహెచ్ఎఫ్ఎల్చట్టం, స్వీకరించిన విధానాలు మరియు ప్రక్రియల పరిధిలో వినియోగదారుల సంతృప్తి కోసం ప్రయత్నిస్తుంది. ఏదైనా సంకట సందర్భంలో, వినియోగదారుడు అతని/ఆమె ఖాతా కలిగి ఉన్న వ్యాపార ప్రదేశంలో ఇన్చార్జిని సమీపించి ఇన్చార్జితో గల ‘ఫిర్యాదు రిజిస్టర్ లో అతని/ఆమె ఫిర్యాదును నమోదు చేయవచ్చు ఫిర్యాదును రిజిస్టర్ చేసిన మీదట, భవిష్యత్తు రిఫరెన్స్ కోసం వినియోగదారుడు ఫిర్యాదు సంఖ్య మరియు తేదీ పొందాలిసంకట నివారణ నిమిత్తం వినియోగదారుడు సంబంధిత ప్రదేశానికి వ్రాయవచ్చు/తెలియపరచవచ్చు. (స్థానాల జాబితా కోసం, దయచేసి వెబ్ సైట్ కు లాగాన్   - www.gichfindia.com ) ప్రతిస్పందన  అసంతృప్తికరంగా ఉన్నా లేదా ప్రతిస్పందన లేకపోయినా, ఫిర్యాదును ఈ క్రింది వారితో స్థాయిని పెంచాలి - లేఖ ద్వారా :ఉపాధ్యక్షుడుజిఐసిహౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

  యూనివర్సల్ ఇన్సూరెన్స్ బిల్డింగ్, 3వ అంతస్తు,

  సర్ పి ఎం రోడ్, ఫోర్ట్,

  ముంబై 400 001 . ఇమెయిల్ ద్వారా : corporate@gichf.com

 • జనరల్కోడ్లను పైన పేర్కొన్న విధంగా సవరించే/మార్పు చేసే/చక్కదిద్దే హక్కును జిఐసిహెచ్ఎఫ్ఎల్  సురక్షితం చేసుకుంటుంది మరియు కోడ్ యొక్క ముఖ్య భావాన్ని ప్రభావితం/ త్యాగం చేయకుండా, ఎప్పటికప్పుడు నవీకరణలను అందజేస్తూ  ఉంటుంది.  ఇటువంటి మార్పుచేర్పులు/సవరణలు శాఖల/ కార్పొరేట్ ఆఫీస్ యొక్క నోటీస్ బోర్డుల్లో వినియోగదారుల ప్రయోజనం కోసం ప్రదర్శించబడతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website