మా నుండి రుణం అభ్యర్థించేందుకు మీరు ఒక దరఖాస్తు ఫారం నింపాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫారం మా శాఖలలో దేని నుండైనా పొందవచ్చు లేదా మీరు దానిని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఫారం అనేక విభాగాలు కలిగి ఉంటుంది.

ప్రధాన దరఖాస్తు: ఈ విభాగం ఒక ప్రత్యేక పథకం కింద ఒక నిర్దిష్ట మొత్తంలో రుణం కోరుతూ ఒక అధికారిక ప్రకటన. పథకాల వివరాలు ఇక్కడ చూడవచ్చు.

దరఖాస్తుదారుల సంఖ్య: కనీసం ఒక దరఖాస్తుదారు అవసరం. అయితే, ఒక సహ-దరఖాస్తుదారు ఉండటం కూడా సాధ్యమే.

 వ్యక్తిగత సమాచారం: ప్రతి ఒక్క దరఖాస్తుదారు మరియు సహ దరఖాస్తుదారు కోసం, వివిధ వ్యక్తిగత సమాచారం, నివాస సమాచారం, మరియు ఉద్యోగ సమాచారం అవసరం. మీరు మీ పాన్ కార్డు లేదా వోటర్  ఐడి  సంఖ్యను సబ్మిట్ చేసి, మరియు మీ వార్షిక ఆదాయాన్ని ప్రకటించవలసి ఉంటుంది కూడా.

ఆర్థిక సమాచారం: దరఖాస్తుదారు మరియు సహ దరఖాస్తుదారుల ఆస్తులు మరియు ఉత్తరదాయిత్వాలను పట్టికగా చూపిస్తూ ఒక మామూలు జాబితా ఇవ్వవలసి  ఉంటుంది. మీ అర్హతను మరియు రుణ రూపంలో ఇవ్వగలిగిన మొత్తాన్ని నిర్ధారించేందుకు వీటిని జీతం స్లిప్స్, ఆదాయం పన్ను రిటర్న్స్ మొ. వాటి  ద్వారా అందజేసిన ఆర్థిక దస్తావేజులతో సరిపోల్చడం జరుగుతుంది. ఇవి కాకుండా,  మీకు ఇప్పటికే ఉన్న రుణాల వివరాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది.

ఆస్తి వివరాలు:  ఆస్తి ఉన్న ప్రదేశం, దాని పట్టా స్పష్టంగా ఉన్నదో లేదో, ప్లాట్ విస్తీర్ణం  (ఒక స్వంతగా నిర్మించుకున్న గృహం విషయంలో) లేదా ప్లాట్ విస్తీర్ణం, ఇంకా అటువంటి ఇతర వివరాలను నింపవలసి  ఉంటుంది.

సాధారణ ప్రకటనలు:  ఇవి ఆస్తిని ఎలా ఉపయోగించవలసి ఉంటుంది అనే దాని గురించి సాధారణ ప్రశ్నలు, మరియు ఆస్తి యొక్క ప్రస్తుతం స్థితి.

రిఫరెన్సులు: మీతో పని చేసిన, లేదా ఒక వృత్తిపరమైన మరియు/లేదా వ్యక్తిగత హోదాలో చెప్పుకోదగినంత కాలంగా మీకు తెలిసి ఉన్న కనీసం ఇద్దరు వ్యక్తుల నుండి రిఫరెన్సులు.

అదనపు సమాచారం: మీ రెగ్యులర్ జీతం ఖాతా వివరాలు కూడా దరఖాస్తు ఫారంతో ఇవ్వవలసి ఉంటుంది.

ఛాయాచిత్రాలు: సంతకాలతో పాటు దరఖాస్తుదారు మరియు సహ దరఖాస్తుదారులది కనీసం ఒక ఫోటో అయినా సమర్పించవలసి ఉంటుంది.

హామీదారు పత్రం: ప్రతి ఒక్క గ్యారెంటార్ యొక్క వ్యక్తిగత సమాచారం, సంప్రదింపుసమాచారం మరియు ఆర్థిక సమాచారాన్ని, మీరు ప్రధాన దరఖాస్తు ఫారంతో పాటు డౌన్ లోడ్ చేసుకోగలిగిన ఒక ప్రత్యేక ఫారం పై, దీనిని సమర్పించవలసి ఉంటుంది

యజమాని వివరాలు: మీ యజమాని జాబితా చేయబడని ఫర్మ్, లేదా ఒక అంతగా బాగా తెలియని ఫర్మ్ అయిన సందర్భంలో,వ్యాపార స్వభావం, పోటీదారులు, కార్యాలయాల సంఖ్య, టర్నోవర్ మొదలైనవాటి గురించి ఒక చిన్న సారాంశం ఇవ్వడమనేది ఎప్పుడూ ఒక మంచి ఆలోచన. సాధారణంగా వెబ్సైట్లో ఇవ్వబడిన కంపెనీ ప్రొఫైల్ సరిపోతుంది.

మీరు కావలసిన అన్ని దస్తావేజుల కాపీలను సమర్పిస్తున్నారని నిర్ధారించుకునేందుకు చెక్ లిస్ట్ ఉపయోగించండి, మరియు మీరు మీ దరఖాస్తు సమర్పించేందుకు వచ్చేటప్పుడు అసలువాటిని వెంట తెచ్చుకోండి.

బ్యాంకు స్టేట్మెంట్లు: ఆదర్శంగా కనీసం ఒక 12 నెలల వ్యవధికి ఇవిసమర్పించడం అవసరం. వాటి సక్రియత స్టాయి (లావాదేవీల సంఖ్య మరియు ప్రకృతి), సగటు బ్యాంకు బ్యాలెన్స్,, తిరిగివచ్చిన చెక్ లు, బౌన్స్ అయిన చెక్ లు, మరియు చెల్లింపు యొక్క (ఉదా. ఒక నిర్దిష్ట విరామం వద్ద జమచేయబడిన జీతం మొత్తం) పీరియాడిసిటి కోసం అవి పరిశీలించబడతాయి..

వ్యక్తిగత చర్చ

సాధారణంగా, మా అధికారులలో ఒకరితో మీకుఒక ఇంటర్వ్యూ ఉంటుంది,  ఈ సమయంలో మీరు గణాంకాలు మరియు ప్రక్రియల గురించి మీకు ఉన్న అన్ని సందేహాలు మీరు నివృత్తి చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో, అదనపు గ్యారెంటార్లనులేదా వివరాలను సమకూర్చవలసిందిగా మిమ్మల్ని అడగవచ్చు.

తనిఖీ (వెరిఫికేషన్)

అందజేయబడిన సమాచారమంతటికీ ఒక ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది, ముఖ్యంగా వీటి కోసం

నివాస చిరునామా

కార్యాలయ చిరునామా

ఉపాధి తనిఖీ వెరిఫికేషన్

బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్

నివాస మరియు కార్యాలయ టెలిఫోన్ నెంబర్లు

ఆస్తి చిరునామా

ఆర్థిక పత్రాలు

కొన్నిసార్లు దరఖాస్తు ఫారంలో మీరు అందజేసిన రిఫరెన్సులకు కూడా ఒక శీఘ్ర చెక్ ఉంటుంది. ఒకసారి మీ ప్రమాణ ఆధారాలు ధృవీకరించబడితే,  మీకూ మాకు మధ్య ఒక నమ్మకం ఏర్పడటం సులభమవుతుంది..

రుణం ఆమోదం

ఒకసారి మీ దరఖాస్తు ప్రాసెస్ చేయబడితే మరియు అభ్యర్ధించిన రుణ మొత్తం మరియు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి, తుది రుణ మొత్తాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు  ఏ నిబంధనలు మరియు షరతులు కింద మీకు రుణం మంజూరు చేయబడిందో తెలుపుతూ ఒక శాంక్షన్ లేఖ జారీ చేయబడుతుంది. రుణ మొత్తం వితరణ చేయబడే పూర్వం ఈ నియమాలు మరియు నిబంధనలను నెరవేరేర్చవలసి ఉంటుంది.

ఆఫర్ లెటర్

ఆఫర్ లెటర్ రుణ మొత్తాన్ని, వడ్డీ రేటు, కాల పరిమితి, తిరిగి చెల్లింపు పధ్ధతి మరియు ఇతర వివరాలు మరియు ప్రత్యేక పరిస్థితులను పేర్కొంటుంది.

మా ద్వారా అందజేయబడిన ప్రామాణిక ఫార్మాట్ లో అంగీకారం లేఖను మంజూరు లేఖ యొక్క నిబంధనలు మరియు షరతులులో ఇచ్చిన ఏవైనా దస్తావేజులతో పాటుగా మీరు ఇవ్వవలసి ఉంటుంది.ఇది మీ ఋణం ప్రతిపాదన యొక్క ఒక ఆర్థిక ఆమోదం మాత్రమే. మీరు ఆఫర్ అంగీకరించి మరియు తాకట్టు చట్టబద్ధంగా అమలపరచేందుకు వీలుగా మరియు సాంకేతికంగా స్పష్టంగా ఉన్న తర్వాత రుణ పంపిణీ ఉంటుంది.

చట్టపరమైన పత్రాల సమర్పణ

ఒకసారి మీరు ఆఫర్ అంగీకరించినప్పుడు, రుణం పూర్తిగా తిరిగి చెల్లించబడేంతవరకు, మా వద్ద భద్రతగా వాటిని ఉంచుకునేందుకు వీలుగా ఆస్తి యొక్క అసలు దస్తావేజులను మీరు అప్పగించవలసిన అవసరం ఉంటుంది. కొల్లేటరల్ సెక్యూరిటి వంటి రుణ పరిస్థితుల ప్రకారం అవసరమైన ఏవైనా మరిన్ని దస్తావేజులను కూడా ఈ దశలో సమర్పించవలసి ఉంటుంది.

ఒప్పందం సంతకం చేయుట

ఒప్పందం మరియు ఇతర దస్తావేజులు సరైన పధ్ధతి ప్రకారం సంతకం చేయడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website