Ashok-K-Royశ్రీ.అశోక్కె. రాయ్: బోర్డు ఛైర్మన్.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్పూర్ నుండి బి.టెక్ (హానర్స్)తో ఒక వ్యవసాయ ఇంజనీర్ మరియు ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్  ఆఫ్  ఇండియాలో సభ్యుడు అయిన  శ్రీ అశోక్ కె. రాయ్ 1979 లో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్ గా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో చేరారు. వారు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కు వివిధ హోదాల్లో 29 సంవత్సరాల పాటు, జూన్ 2008 లో జనరల్ మేనేజర్ గా జిఐసి రెకువెళ్లే ముందు ప్రధానంగా ఆస్తి  అండర్ రైటర్ గా సేవలు అందించారు.

డిసెంబర్ 2011 లో శ్రీ రాయ్ ఎగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియేటింగ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. జనవరి 2012 లో వారు జిఐసి రే కు అఫీషియేటింగ్ సిఎమ్ డి గా చేయబడి ఏప్రిల్ 2012 లో జిఐసి రే చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆ స్థానంలో నిర్ధారించబడ్డారు.

శ్రీ రాయ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కు చైర్మన్ కూడా; వారు భారతీయ జీవిత బీమా సంస్థ; ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్, తూర్పు ఆఫ్రికా రీఇన్స్యూరెన్స్ కం లిమిటెడ్, కెన్ఇండియా అస్యూరెన్స్ కం. లిమిటెడ్, ఆసియన్ రీఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ మరియు ఇసిజిసి ఆఫ్ ఇండియాతో సహా పలు సంస్థల బోర్డులో కూడా వారు డైరెక్టర్ గా ఉన్నారు.

శ్రీ రాయ్ టిఎసి యొక్క సాంకేతిక సబ్ కమిటీ (ఇంజినీరింగ్) సభ్యుడుగా ఉన్నారు మరియు కోర్ ఇన్స్యూరెన్స్ సొల్యూషన్ (ఐఎన్ఎల్ఐఎఎస్) అభివృద్ధి లో సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నారు. ఫైర్ & ఇంజినీరింగ్ మాడ్యూల్ అభివృద్ధి కోసం కోర్ గ్రూప్ కు నాయకత్వం కూడా వహించారు. వారు అనేక మేనేజ్మెంట్ మార్పు, నెగోషియేషన్ నైపుణ్యాలు, మరియు కార్పొరేట్ గవర్నెన్స్ పై అనేక శిక్షణ కార్యక్రమాల్లో ఒక ఉపన్యాసిగా ఉన్నారు. జిఐసి రే వద్ద హెచ్ఆర్ అభివృద్ధిలో వివిధ ప్రయత్నాల కోసం వారు పేరు గాంచారు. జిఐసి రే వద్ద ఒక నూతనకల్పన కేంద్రాన్ని నెలకొల్పడం జిఐసి రే వద్ద చేయబడిన అత్యంత ఇటీవలి ప్రయత్నం..

G-Srinivasanశ్రీ జి శ్రీనివాసన్: బి.కాం, ఎఫ్ఐఐఐ, ఎసిఎమ్ఎ

శ్రీ జి శ్రీనివాసన్  2012అక్టోబర్ 18నాటి నుండి న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.

న్యూ ఇండియా యొక్క సిఎండి గా వారి నియామకానికి పూర్వం వారు యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క సిఎండి గా ఉన్నారు. వారు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (టిఎన్ టి) లి., ట్రినిడాడ్ మరియు టొబాగో కు మేనేజింగ్ డైరెక్టర్ గా మరియు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లు జనరల్ మేనేజర్ గానూ పని చేసారు. వారికి భీమా పరిశ్రమలో 33 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. వారు 2010 జూలై 28 నుంచి జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్  ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ గా ఉన్నారు. వారు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (ట్రినిడాడ్ మరియు టొబాగో) లిమిటెడ్, ప్రెస్టీజ్ అస్యూరెన్స్ పిఎల్సి, నైజీరియా మరియు ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్యూరెన్స్ పిఎల్సి, సింగపూర్ కు ఒక డైరెక్టర్ అయి ఉన్నారు.

A-K-Saxena-డాక్టర్ ఎకెసక్సేనా:

2012 జూన్ 12నాటి నుండి డాక్టర్ ఎకెసక్సేనా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఢిల్లీ, యొక్క చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ ఎకెసక్సేనా ఇంతకు పూర్వం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లోనే జనరల్ మేనేజర్ గా నియమించబడ్డారు.

డాక్టర్ ఎకెసక్సేనా వెటర్నరీ సైన్సెస్ లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఇంకా బ్యాచిలర్ ఆఫ్ లా అయి ఉన్నారు. వారు ఇన్స్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ఒక అసోసియేట్ సభ్యుడు కూడా.

డాక్టర్ ఎకెసక్సేనా 1979 సంవత్సరంలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఎ) లో ఒక అధికారిగా తన వృత్తిని ప్రారంభించి, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ యొక్క వివిధ  ఆఫీసుల్లో ఫిలిప్పీన్స్లో మనీలా వద్ద పోస్టింగ్ తో పాటు ఉత్తర ప్రదేశ్ మరియుముంబై లో వివిధ లైన్ మరియు సిబ్బంది బాధ్యతలను నిర్వహించారు, ఇంతేకాక కెన్ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నైరోబి తో పనిచేసారు. వారు ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్యూరెన్స్ పిటిఇ సింగపూర్యొక్క ఒక డైరెక్టర్ కూడా

Milind-A-Kharatశ్రీ మిలింద్ ఖారత్:

శ్రీ మిలింద్ ఖారత్: అక్టోబర్ లో యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కం. లి. కు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు .

శ్రీ. ఖారత్ బాంబే విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఒక ఎల్ఎల్ బి. వారు ఇన్స్యూరెన్స్ ఇన్స్టిట్యూట్  ఆఫ్ ఇండియాలో ఒక సభ్యుడు కూడా.

శ్రీ ఖారత్ జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్  ఆఫ్ ఇండియా యొక్క  భారతదేశం యొక్క 1979 బ్యాచ్ లో డైరెక్ట్ రిక్రూట్  ఆఫీసర్ గా తన కెరియర్ ప్రారంభించారు మరియు తరువాత డివిజనల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ మేనేజర్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లి. లో ప్రాంతీయ ఇన్ఛార్జ్ తో సహా విభిన్న ప్రొఫేల్స్ తో వివిధ స్థాయిల్లో వివిధ హోదాల్లో పని చేసారు.

శ్రీ ఖారత్, ఫిజి దీవులు, మరియు టోక్యో, జపాన్ లలో రెండు స్వల్ప కాలపు అంతర్జాతీయ పోస్టింగులు కలిగి ఉన్నారు. వారు  1995 నుండి 2001 వరకు ఫిజికి ఛీఫ్ మేనేజర్ గా ఫిజి వద్ద వారి కార్యకాలంలో వారి అద్భుతమైన పనితీరుకు అవార్డులతో గుర్తించబడ్ధారు. వారు ఫిజీ రీఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ కు డైరెక్టర్ గా మరియు ఫిజీ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కు చైర్మన్ గా పదవులను నిర్వహించారు. మరియు వారు ఫిజీ ఇన్స్యురెన్స్ చట్టం 1998 ని రివైజ్ చేయడంలో గణనీయంగా దోహదపడ్డారు మరియు ఫిజీలో రహదారి భద్రత బాధ్యత కలిగిఉన్న ఫిజీ నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ సభ్యుడుగా పనిచేశారు.

శ్రీ ఖారత్  2004నుండి 2007న్యూ ఇండియా అస్యూరెన్స్ కం. లి. యొక్క జపాన్ ఆపరేషన్స్ కోసం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పోస్ట్ చేయబడ్డారు. వారు జపాన్ యొక్క ఫారెన్ నాన్-లైఫ్ ఇన్స్యురెన్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడుగానూ మరియు ఇండో జపాన్ ఫ్రెండ్షిప్ సంవత్సరం 2007 వేడుక జరుపుకోవడం కోసం ఫైనాన్స్ కమిటీ సభ్యుడు గానూ ఉన్నారు.

వారు హెచ్ఆర్, శిక్షణ, సముద్ర సరుకు, మెరైన్ హల్, మోటార్ మరియు లీగల్ శాఖల రంగాల నుండి అనుభవజ్ఞులై   ఉన్నారు.

యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కం. లి. చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వారి పోస్టింగ్ కు పూర్వం, వారు  అగ్రికల్చరల్ ఇన్స్యురెన్స్ కం.  ఆఫ్ ఇండియా లి., న్యూ డిల్లీ లో సిఎండి పదవినినిర్వహించారు.

V-Ramasamyశ్రీ. వి. రామసామి:

వృత్తిపరంగా చార్టెడ్ అకౌంటెంట్, 1975 సంవత్సరంలో ఒక  డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్ గా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కం లిమిటెడ్ లో చేరారు. తన పదవీకాలంలో, వారు వివిధ హోదాల్లో పనిచేశారు మరియు 2005లో, వారు చైర్మన్-కమ్- మేనేజింగ్ డైరెక్టర్ హోదాకు పదోన్నతి పొందారు.

వారు అక్టోబర్ 2005 నుండి మే 2009 వరకు నేషనల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ లో చైర్మన్-కమ్- మేనేజింగ్ డైరెక్టర్ గా చేరారు. వారి పదవీవిరమణ తరువాత, వారిని ఆగష్టు నుండి మూడేళ్ళపాటు భీమా విచారణాధికారి (ఒంబడ్సమన్) తమిళనాడు లో నియమితులయ్యారు

Kamlesh-S-Vikamseyశ్రీ కమలేష్ శివజీ వికామ్సే:

ముంబై విశ్వవిద్యాలయం నుండి బి కామ్, చార్టర్డ్ అకౌంటెంట్ మరియు అకౌంటింగ్ మరియుఫైనాన్స్ , టాక్సేషన్ మరియు కార్పొరేట్ సలహా సేవల్లో 30 సంవత్సరాల అనుభవం ఉంది. వారు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యుఎన్ డిపి), న్యూయార్క్ యొక్క ఆడిట్ సలహా కమిటీ, సభ్యుడుమరియు భారతదేశపు ఎప్పెల్లేట్ అథారిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్  ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసిఎఐ) యొక్క సభ్యుడు కూడా. వారు 2005-06 సమయంలో ఐసిఎఐ అధ్యక్షుడిగా మరియు 2004-05 సమయంలో ఐసిఎఐ ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. వారు 1998 నుండి 2007 వరకు ఐసిఎఐసెంట్రల్ కౌన్సిల్ యొక్క ఎన్నికైన సభ్యుడిగా ఉన్నారు.  ఆ తరువాత 2007-09 సమయంలో వారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ ఎండ్పసిఫిక్ అకౌంటెంట్స్ (సిఎపిఎ) అధ్యక్షుడుగానూ మరియు 2005-07 సమయంలో సిఎపిఎఉపాధ్యక్షుడుగానూ ఉన్నారు. వారు 2005-08 సమయానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్  ఆఫ్ అకౌంటెంట్స్ యొక్క బోర్డు సభ్యుడుగా ఉన్నారు. వారు మెస్సర్స్. ఖీమ్జి కువర్జీ ఎండ్ కో. లో 1982 నుండి ఒక సీనియర్ భాగస్వామిగా సంబంధం కలిగి ఉన్నారు. ఐక్యరాజ్యసమితిలో పాలన మరియు పర్యవేక్షణ యొక్క సమగ్ర సమీక్ష కోసం స్టీరింగ్ కమిటీ సభ్యడుగా ఉండటంతో సహా వారు వివిధ సలహా మరియు నిపుణుల కమీటీల్లో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో సభ్యుడుగా సేవలందించారు.

Mona-Bhideమిస్ మోనా భిడే:

ముంబై విశ్వవిద్యాలయం నుంఢి బి.కామ్, ఎల్ఎల్ బి, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ లా నుండి, చికాగో అయిన వీరు అంతర్జాతీయ ఫైనాన్స్ మరియు కార్పొరేట్ చట్టాలపై దృష్టిని కేంద్రీకరించే ఒక లా ఫర్మ్ అయిన డేవె ఎండ్గిరీష్ ఎండ్కో లో ఒక మేనేజింగ్ భాగస్వామి. ఆమె వివిధ బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థలకు సలహాదారుగా కూడా ఉన్నారు.

ఆమె మహారాష్ట్ర, గోవా, బాంబే బార్ అసోసియేషన్, అంతర్జాతీయ స్వాప్స్ ఎండ్ డెరివేటివ్స్ అసోసియేషన్, అంతర్జాతీయ బార్ అసోసియేషన్, న్యూయార్క్ స్టేట్ బార్ అసోసియేషన్, ఇంటర్ పసిఫిక్ బార్ అసోసియేషన్ మరియు ఆసియా పసిఫిక్ లోన్ మార్కెట్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ సభ్యులు.

ఆమె ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, విభేదాలు మరియు న్యాయ వృత్తి ప్రపంచీకరణ రంగంలో అమెరికన్ బార్ ఫౌండేషన్ తో పని చేసారు మరియు అంతర్జాతీయ లా ఫర్మ్, సెడ్విక్, డీటర్ట్ మోరన్ మరియు ఆర్నాల్డ్  తో కూడా పనిచేసారు.

గ్లోబల్ కౌన్సెల్ 3000 లో ఆమె భారతదేశంలో ప్రాజెక్ట్ ఫైనాన్స్ మరియుకార్పొరేట్, మర్జర్స్ ఎండ్ ఎక్విజిషన్స్ లావాదేవీలు, రిస్ట్రక్చరింగ్ మరియు దివాళా (ఇన్సాల్వెన్సీ) ప్రాక్టీషనర్ మరియు కార్పొరేట్ లావాదేవీల ప్రాక్టీషనర్లల్లో   అత్యంత సిఫార్సు చేయబడే న్యాయవాదుల్లో ఒకరు.

ఆమె బ్యాంకింగ్ మరియుఫైనాన్స్, కార్పొరేట్, మర్జర్స్ ఎండ్ ఎక్విజిషన్స్ మరియు వివాద పరిష్కారంలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తిగా లీగల్ 500 ద్వారా మరియు ఆసియా లా ప్రొఫైల్స్ ద్వారా ప్రముఖ న్యాయవాదిగానూ ర్యాంక్ చేయబడింది.

Warendra-Sinhaశ్రీ వరేంద్రసిన్హా – మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ

శ్రీ వరేంద్రసిన్హా హన్స్రాజ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం యొక్క పూర్వ విద్యార్ధి మరియు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ నుండి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్. వారు 1982 లో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చేరారు మరియు బ్రాంచ్, డివిజన్ మరియు ప్రాంతం ఇన్చార్జి గా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 2008 వరకు పనిచేశారు. ఈ మధ్య లో, వారు కెన్ఇండియాఅస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నైరోబి, కెన్యా వద్ద 4 సంవత్సరాల డెప్యుటేషన్ చేసారు. 2008 లో జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ పొందిన మీదట, వారు మార్కెటింగ్, పబ్లిసిటి మరియు బిపిఆర్ చూసుకుంటూ, కోలకతా లోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*
Website