హౌసింగ్ అనేది ప్రతి మానవుని ప్రాధమిక అవసరాల్లో ఒకటి, మిగిలిన మూడు ఆహారం, దుస్తులు మరియు విద్య. హౌసింగ్ అనేది ప్రజలకు ఒక ముఖ్యమైన అంశం మరియు సామాజిక-ఆర్థిక స్థాయి యొక్క కొలత. పాలసీ కార్యక్రమాలు మరియు జోక్యాల పరంగా ఇది ఒక క్లిష్టమైన రంగంగా భావించబడుతుంది. ఒక సామాజిక అవసరంగా హౌసింగ్ ఎప్పటినుంచో గుర్తించబడి ఉంది, మరియు రాతి యుగం నాటి నుండి మానవజాతి చేసిన నవకల్పనలు మరియు ఆవిష్కరణలను ఇది ప్రభావితం చేసింది.

మానవజాతి యొక్క ముఖ్యమైన అవసరాల్లో హౌసింగ్ ఒకటి అవడంతో, జనాభా మరియు జీవన ప్రమాణం పెరుగుదలతో ఆశ్రయం కోసం డిమాండ్ పెరుగుతుంది, అందుకే ఒక ఇల్లు కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ చేయవలసిన అవసరం వచ్చింది. మనం ఇంటిని ఉత్తమ పెట్టుబడిగా పరిగణిస్తాము మరియు మన కష్టార్జిత సంపాదనను లేదా పొదుపును ఒక ఇంటి మీద పెట్టుబడి పెట్టాలని అనుకుంటాము. ఇంటి కొనుగోలు కోసం ఫైనాన్స్ అవసరం, ప్రత్యేక హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను తీసుకువచ్చింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్ సిలు), వాటిని నేడు అలా వ్యవహరిస్తారు, హౌసింగ్ రంగం వృద్ధికి దోహదపడుతూ, సంవత్సరాలుగా వారి రుణాలను ఇవ్వడాన్ని పెంచారు. ప్రత్యేకంగా హౌసింగ్ రంగం కోసం అప్పులివ్వడంలో వారి నైపుణ్యాల్లో వారి బలం ఉంటుంది. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (జిఐసిహెచ్ఎఫ్ఎల్) నేపధ్యం ఇటువంటిదే.

జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, 1989 డిసెంబర్ 12న ‘జిఐసి గృహ్ విత్తా లిమిటెడ్’ గా ప్రారంభించబడింది. 1993 నవంబర్ 16 న జారీ చేయబడిన తాజా ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ ద్వారా ప్రస్తుత పేరుకు పేరు మార్చబడింది. భారతదేశం లో హౌసింగ్ కార్యకలాపాలు వేగవంతం చేసేందుకు వ్యక్తులు మరియు ఇతర కార్పొరేట్ లకు నేరుగా అప్పు ఇచ్చే రంగంలో ప్రవేశించే ఉద్దేశ్యంతో కంపెనీ ఏర్పాటుచేయబడింది. జిఐసిహెచ్ఎఫ్ఎల్ యొక్క ప్రాధమిక వ్యాపారం ఏమిటంటే వ్యక్తులకు మరియు నివాసానికి ఉపయోగడే ఉద్దేశ్యాలతో ఇళ్ళు/ఫ్లాట్లు నిర్మాణంలో నిమగ్నమైన వ్యక్తులు/సంస్థలకు హౌసింగ్ రుణాలను మంజూరు చేయడం. భారతదేశంలో హౌసింగ్ భవిష్యత్తు కోసం కంపెనీ ఒక విజన్ ను కలిగి ఉన్నది. మరియు జిఐసిహెచ్ఎఫ్ఎల్ వద్ద ఎల్లప్పుడూ కూడా దాని విజయం మరియు ఎదుగుదల దాని సూత్రాలపై ఆధారపడి ఉంటాయని నమ్ముతారు, అవి ఏమిటంటే;

  • ఒక సేవల ఆధారిత వాతావరణంలో వినియోగదారులతో స్నేహపూర్వకమైన ఫైనాన్స్ పథకాల ద్వారా హౌసింగ్ కార్యకలాపాలను ప్రచారం చేయడంలో ఒక ప్రముఖ కార్పొరేట్ పౌరుడుగా ఉండాలి అని.
  • ఒక మంచి కార్పొరేట్ పౌరుని నైతిక ప్రామాణికతను ప్రతిబింబిస్తూ ఒక పోటీ వాతావరణంలో కూడదీసుకోవడం మరియు పెరగడం.
  • సంపద మరియు ప్రతిఫలం షేర్ హోల్డర్లను సృష్టించుట

కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు దాని పూర్వపు అనుబంధ సంస్థలు అనగా, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా యుటిఐ, ఐసిఐసిఐ, ఐఎఫ్ సిఐ, హెచ్ డిఎఫ్ సి మరియు ఎస్ బిఐ తో కలిసి ప్రచారం చేయబడింది, ఇవి అన్నీ కూడా ప్రాధమిక షేర్ మూలధనానికి తోడ్పడ్డాయి.

జిఐసిహెచ్ఎఫ్ఎల్ వ్యాపారం కోసం దేశవ్యాప్తంగా 53 శాఖలు కలిగి ఉంది. సేల్స్ అసోసియేట్స్ (ఎస్ఎఎస్) ద్వారా మరింతగా సహకరించబడే బలమైన మార్కెటింగ్ జట్టును ఇది కలిగి ఉంది. వ్యక్తిగత రుణగ్రహీతలకు ఫైనాన్స్ అందించడానికి బిల్డర్లతో సంస్థకు టై-అప్స్ ఉన్నాయి. పలు హౌసింగ్ ఫైనాన్స్ అవసరాలకు కార్పొరేట్స్ తో కూడా సంస్థకు టై-అప్స్ ఉన్నాయి.

కంపెనీ చరిత్రలో ప్రధాన సంఘటనలు
సంవత్సరం సంఘటన
1989 కంపెనీ “జిఐసి గృహ్ విత్త లిమిటెడ్” పేరుతో ఏర్పడింది.
1989-91 కంపెనీ 8 స్థానాల నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.
1991-92 కంపెనీ ఎంప్లాయీ ఎండ్ బిల్డర్ స్కీమ్ హౌసింగ్ స్కీమ్ ప్రారంభించింది.
1992-93 కంపెనీ పేరు ” జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్”గా మారింది. అప్నా ఘర్ యోజనా ని కంపెనీ ప్రవేశపెట్టింది.
1993-94 కంపెనీ ఒక 1:1 రైట్స్ ఇష్యూ చేసింది; మూలధనం 10 కోట్ల గుర్తుని దాటింది.
1994-95 కంపెనీ దాని తొలి ఐపిఒ చేసింది మరియు రూ. 40 కోట్ల అదనపు పెట్టుబడి కూడగట్టుకుంది..
1996-97 కంపెనీ కంప్యూటరీకరణ విధానాన్ని ప్రారంభించింది.
2003-04 కంపెనీ రుణ ఆమోదాలు, వితరణలు మరియు లాభదాయకతలో 40% పైగా మించిన పరిశ్రమ వృద్ధి రేటు నమోదు చేసింది. దీని ఫలితంగా కంపెనీ వ్యక్తిగత గృహ రుణంలో రూ 500 కోట్ల వార్షిక వ్యాపారాన్ని దాటిపోయింది మరియు మొత్తం పోర్ట్ఫోలియో రూ. 1000 కోట్లు దాటిపోయింది.
2004-05 రుణ ఆమోదాలు, వితరణలు మరియు లాభదాయకతలో 40% పైగా మించిన పరిశ్రమ వృద్ధి రేటు నమోదు చేసింది. ఉన్న ప్రతి 2 షేర్లకు 1 షేరు నిష్పత్తిలో 89,75,561 ఈక్విటీ షేర్లు రూ. 16. చొప్పున. పెయిడ్ అప్ మూలధనం రూ 26,93 కోట్లకు పెరిగింది.
2005-06 ఎన్ పిఎ గట్టిపరచుకోవడం పై కేంద్రీకరించడం మరియు లాభదాయకత.
2006-07 రైట్స్ ఇష్యూ  - నగదుకు రూ.10 / ముఖ విలువ కలిగిన 2,69,25,533 ఈక్విటీ షేర్లను – షేరుకు రూ.30 ప్రీమియంతో ప్రతి 1 ఈక్విటీ షేర్ కు 1 ఈక్విటీ షేరు నిష్పత్తిలో కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ హోల్డర్స్ కు హక్కుల ప్రాతిపదికన మొత్తంగా రూ. 107, 70, 21,320 జారీచేయడం జరిగింది మరియు 2006 మే 19 న కేటాయించబడింది. పోస్ట్ రైట్స్ ఇష్యూ, కంపెనీ యొక్క మూలధనం రూ. 26.93 కోట్లు మరియు షేర్ ప్రీమియం రూ. 80.78 కోట్లు పెరిగింది. పెయిడ్ అప్ మూలధనం 2007 మార్చి 31 నాటికి రూ.53.86 కోట్ల వద్ద నిలిచి ఉంది.సంవత్సరానికి ప్రకటించిన డివిడెండ్ శాతం మునుపటి సంవత్సరం 15% కు ప్రతిగా 30% కు పెరిగింది. సంవత్సరంలో కంపెనీ విరార్, ముంబై పశ్చిమ శివారు, మహారాష్ట్రలో తన శాఖలను తెరుస్తుంది.
2007-08 వ్యక్తిగత రుణం పోర్ట్ఫోలియో సంవత్సరంలో రూ .2000 కోట్లు దాటి, 2008 మార్చి 31 నాటికి రూ.2427.35 కోట్ల వద్ద నిలిచి ఉంది.
2008-09 వ్యక్తిగత రుణం పోర్ట్ఫోలియో సంవత్సరంలో రూ 2500 సంవత్సరంలో కోట్లు దాటి, 2009 మార్చి 31 నాటికి రూ.2682 కోట్ల వద్ద నిలిచి ఉంది.
2009-10 ఆ సంవత్సరంలో కంపెనీ గుజరాత్ లోని వడోదర వద్ద తన మొదటి శాఖను ప్రారంభిస్తుంది మరియు నాగ్పూర్ మరియు నాసిక్ లో శాఖలు తెరవడం ద్వారా మహారాష్ట్రలో తన నెట్వర్క్ విస్తరింపజేస్తుంది.ఒక జీవిత భీమా సంస్థ తో టై అప్ ద్వారా వసూలుకాని రుణం మొత్తం మేరకు కవర్ చేస్తూ అర్హతగల రుణగ్రహీతలకు ఐచ్ఛిక గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ పరిచయం చేసింది.
2010-11 సంవత్సరంలో ఆమోదించబడిన వ్యక్తిగత రుణాలు రూ.1000 కోట్లు దాటింది. సంవత్సరంలో ఆమోదించబడిన వ్యక్తిగత రుణాలు రూ.1069 కోట్లు. వ్యక్తిగత రుణ పోర్ట్ఫోలియో రూ.3000 కోట్లు దాటి, 2011 మార్చి 31నాటికి రూ.3406 కోట్ల వద్ద నిలిచి ఉంది.ఒక పర్యాయం 10% ప్రత్యేక డివిడెండ్ తో సహా 55% డివిడెండ్ ప్రకటించబడింది జోధ్పూర్ వద్ద రాజస్థాన్ లో రెండవ శాఖ మరియు పశ్చిమ బెంగాల్ లో దుర్గాపూర్ వద్ద రెండవ శాఖ ప్రారంభించబడింది మరియు కొల్హాపూర్ వద్ద శాఖ తెరవడం ద్వారా మహారాష్ట్రలో మరింత విస్తరిస్తుంది.
2011-12 ఆ సంవత్సరంలో వితరణ చేయబడిన వ్యక్తిగత రుణాలు రూ. 1000 కోట్ల దాటింది, అది సంవత్సరంలో రూ.1069 కోట్ల వద్ద నిలిచి ఉంది. వ్యక్తిగత రుణ పోర్ట్ఫోలియో రూ.3500 కోట్లు దాటింది, ఇది 2012 మార్చి 31, నాటికి రూ. 3864 కోట్ల వద్ద నిలిచి ఉంది.నేరె పాన్వెల్, ముంబై శివారులో తన కొత్త శాఖ తెరవడం ద్వారా కంపెనీ మహారాష్ట్ర లో మరింతగా విస్తరిస్తుంది.
2012-13 కంపెనీ తమ మొదటి శాఖను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వద్ద తెరుస్తుంది.
2013-14 కంపెనీ పాట్నా వద్ద తమ 43వ బ్రాంచ్ తెరుస్తుంది.
2013-14 కంపెనీ అహ్మదాబాద్ వద్ద తమ 44వ బ్రాంచ్ తెరుస్తుంది.
2013-14 కంపెనీ కళ్యాణ్ వద్ద తమ 45వ బ్రాంచ్ తెరుస్తుంది.
2013-14 బోరీవాలి వద్ద కంపెనీ తమ 46వ శాఖ తెరిచింది.
2013-14 డెహ్రాడూన్ వద్ద కంపెనీ తమ 47వ శాఖ తెరిచింది.
2014-15 మీరట్ వద్ద కంపెనీ తమ 48వ శాఖ తెరిచింది.
2014-15 బోయిసర్ వద్ద కంపెనీ తమ 49 వ శాఖ తెరిచింది.
2014-15 ఘజియాబాద్ వద్ద కంపెనీ తమ 50 వ శాఖ తెరిచింది.
2014-15 మార్గోవా వద్ద కంపెనీ తమ 51 వ శాఖ తెరిచింది.
2014-15 ద్వారకా వద్ద కంపెనీ తమ 52 వ శాఖ తెరిచింది.
2014-15 ఈ సంవత్సరం కంపెనీ తమ రజిత వార్షికోత్సవం జరుపుకుంటోంది.